ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మొబైల్ యాప్ సర్వే పారదర్శకంగా నిర్వహించాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత కలిగిన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ యాప్ ను రూపొందించిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హత కలిగిన లబ్దిదారుల వివరాలను యాప్ లో నమోదు చేస్తారన్నారు.