ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదవాలనుకునే వారి కోసం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం, సెంటర్ కో-ఆర్డినేటర్ వాసుదేవరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 10వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. రెగ్యులర్ పాఠశాలలో చదువుకోలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అడ్మిషన్ పొందిన వారికి అక్టోబర్ నుంచి తరగతులు నిర్వహించనున్నామని అన్నారు.