సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని బోడిగెపల్లి గ్రామంలో 1. 5 కోట్లతో పిడబ్ల్యూడి రోడ్డు నుండి బోడిగపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.