
హుస్నాబాద్: ప్రత్యేక అధికారిని ఘనంగా సన్మానించిన కమిషనర్ మల్లికార్జున్
హుస్నాబాద్ పురపాలక సంఘ ప్రత్యేక అధికారిగా (రెవెన్యూ, లోకల్ బాడీస్ అదనపు బాధ్యతలు) బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ని సోమవారం మున్సిపల్ కమిషనర్ టీ. మల్లికార్జున్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి, ప్రత్యేక అధికారిని ఘనంగా సన్మానించారు.