చేర్యాల మున్సిపల్ కమిషనర్ సుంచు నాగేందర్ అధ్యక్షతనలో పాలకమండలి వీడ్కోలు సమావేశానికి ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేర్యాల పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ సభ్యులు ఎంతో కృషి చేశారని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని సోమవారం అన్నారు. కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పరిపాలనలో తమకు సహకరించిన పాలక మండలి సభ్యులకు, పట్టణ ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.