నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి

78చూసినవారు
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు మధు, కార్యదర్శి జనార్దన్ డిమాండ్ చేశారు. ఆదివారం వారు సిద్దిపేటలో మాట్లాడుతూ నీట్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని వాపోయారు. నీట్ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్