సింగరేణి తెలంగాణకే తలమానికం: భట్టి

68చూసినవారు
సింగరేణి తెలంగాణకే తలమానికం: భట్టి
బీజేపీ, బీఆర్ఎస్ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 'సింగరేణి గని అంటే ఉద్యోగాల గని. తెలంగాణకే తలమానికం. సింగరేణికి బొగ్గు గనులు లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రస్తుతం 40 బొగ్గు గనులు ఉన్నాయి. కొత్త గనులు అవసరం ఉంది. లేకపోతే సింగరేణి చరిత్రగా మిగిలిపోతుంది. కేంద్రం సింగరేణికి నేరుగా బొగ్గు గనులు కేటాయించే అవకాశం ఉంది. దేశంలో గనుల్నీ వేలం వేసేలా కేంద్ర చట్టానికి సవరణ చేశారు. 2015లో కేంద్రం చేసిన సవరణకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది' అని భట్టి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్