మధురానగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ నియంత్రణపై సీపీ అభిషేక్ మహంతితో ఆదివారం ఎమ్మెల్యే సత్యం మాట్లాడినారు.
చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ లోపించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీపీని కోరారు. చౌరస్తాలో కానిస్టేబుల్ ను డ్యూటీలో ఉంచుతామని సీపీ తెలిపినారు. బస్సులను రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ తెలిపినారు.