ధర్మారం మండలం దొంగతుర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మన ఊరు మనబడి అభివృద్ధి పనుల పట్ల ఉపాధ్యాయుల తల్లిదండ్రులు కలిసి చర్చించారు. అనంతరం విద్యార్థుల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు తెలియజేశారు. అలాగే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు పి సత్తయ్య, ఉపాధ్యాయులు స్వప్న రాణి, మురళీకృష్ణ పాల్గొన్నారు.