వెల్గటూరు: బతుకమ్మ ఘాట్ ను పరిశీలించిన అధికారులు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో బతుకమ్మ ఘాటు వద్ద ఏర్పాట్లను పోలీసు, రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. పెద్ద వాగు సమీపంలో ఎలాంటి అవాంచనీయ సంఘటలు జరుగకుండా బందోబస్తు చర్యలు చేపట్టానున్నామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్ శేఖర్, ధర్మపురి సిఐ రాం నర్సింహారెడ్డి, ఎస్ఐ ఉమా సాగర్, కరోబర్ పంబాల సతీష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.