శ్రీ వాగ్దేవిలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

389చూసినవారు
శ్రీ వాగ్దేవిలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
హుజురాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కళాశాల భౌతికశాస్త్ర అధ్యాపకులు శ్రీ వెంకటేష్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ... సైన్స్ నిత్యజీవితంలో ఏవిదంగా ముడిపడివుందో ఈ రోజులలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ది చెందుతుందని దానికి అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు.

అలాగే భౌతికశాస్త్ర అధ్యాపకులు వెంకటేష్ మాట్లాడుతూ సర్ సి వి రామన్ గురంచి అలాగే వారు కనుగొన్న రామన్ ఎఫెక్ట్ గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి , కొలిపాక రమేష్ , ప్రవీణ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , తిరుపతి , వెంకటేష్ మరియు వివిధ అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్