హుజురాబాద్ పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన సముద్రాల కనుకయ్య(63) గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా జమ్మికుంట నుండి హుజురాబాద్ వైపుకు లారీ వెనుక నుండి ఢీ కొనగా తీవ్ర గాయాలు కాగా మాజీ సర్పంచ్ శారద కారులో ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికోత్స పొందుతూ మృతి చెందాడు. కనుకయ్య కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.