జగిత్యాల: కిరాణ దుకాణంలో చోరీ

59చూసినవారు
జగిత్యాల: కిరాణ దుకాణంలో చోరీ
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శాంతి స్థూపం వద్ద ఆదివారం తెల్లవారుజామున చెట్ పెల్లి గంగాదర్ కిరాణ దుకాణంలో చోరీ జరిగింది. దుండగులు దుకాణం వెనక వైపు నుండి లోనికి ప్రవేశించి విలువైన కిరాణ సామాగ్రితో పాటు కొంత నగదు ఎత్తుకెళ్లారు. వ్యాపారి దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన మరువక ముందే, మరో చోరీ జరగడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్