ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన పులి రూబీ రతన్, బూసారపు హానిక తెలంగాణ రాష్ట్ర స్థాయి 68 వ వాలీబాల్ క్రీడలకు ఎంపికయ్యారు. వీరిరువురిని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు శాలువా కప్పి సన్మానించి అభినందించారు. ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న పులి సునీత కిరణ్ కుమారుడు పులి రూబీ రతన్ మరియు బూసరపు హానిక ఎంపికయ్యారు.