బుగ్గారంలో పిఎసిఎస్ ఏర్పాటు చేయండి

55చూసినవారు
బుగ్గారంలో పిఎసిఎస్ ఏర్పాటు చేయండి
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని మండల అభివృద్ది కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబును కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. గతంలో కూడా అనేక పర్యాయాలు విజ్ఞాపనలు చేయగా జిల్లా సహకార అధికారి ద్వారా ప్రకటనలు జారీ చేసి, ప్రతిపాదనలు పంపారని చుక్క గంగారెడ్డి అదనపు కలెక్టర్ రాంబాబుకు వివరించారు.

సంబంధిత పోస్ట్