రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నాయీబ్రాహ్మణుల ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చెయ్యాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ కోరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయీబ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించుట కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందని అందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న నాయీబ్రాహ్మణులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి. అదేవిధంగా రాజకీయ పరమైన చైతన్యం కోసం ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించి తగిన న్యాయం చేయగలరని కోరడం జరిగింది.
అందులో ముఖ్యంగా రాష్ట్రంలోని దేవాలయం లోని కళ్యాణ కట్టలలో పనిచేస్తున్న నాయీబ్రాహ్మణ కులస్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరడంతోపాటు నాయీబ్రాహ్మణుల రాజకీయ పరమైన చైతన్యం కోసం ప్రభుత్వం నియమించే నామినేటడ్ పదవులలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయీబ్రాహ్మణులకు అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది. నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ఒక పాలకవర్గాన్ని ఎర్పాటు చేసి నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇదివరకే కేటాయించిన 250 కోట్లు రూపాయలు ఫెడరేషన్ ద్వారా నాయీబ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలు చెయ్యాలని. అదేవిధంగా పుణ్యక్షేత్రాలు, ప్రముఖ దేవాలయాలలో అనాదిగా పనిచేయుచున్న నాయీబ్రాహ్మణుకు. మా వాయిద్య కళాకారులను అదుకోవాలని కోరడం జరిగింది.
అలాగే గ్రామీణ స్థాయిలో ఉన్న పేద నాయీబ్రాహ్మణులకు ఒక లక్ష రూపాయల వ్యయంతో ప్రభుత్వం ప్రకటించిన నవీన క్షౌరశాలలు ఎర్పాటు చేసి వారిని జీవనోపాధి కల్పించాలని కోరడం తోపాటు పేదరికం ఉన్న నాయీబ్రాహ్మణులందరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు పోలిసు డిపార్ట్మెంట్ లో, జైలులో, అలాగే ఇతర ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లలో ఉన్న బార్ బార్ పోస్టులకు రిజర్వేషన్లు మినహాయించి కేవలం నాయీబ్రాహ్మణులకు మాత్రమే కేటాయించాలని కోరడం జరిగింది. అలాగే అధునాతన పద్ధతిలో క్షౌరవృతి మరియు వాయిద్య కళల శిక్షణ, బ్యాటిషన్ కోర్సుల శిక్షణ కేంద్రాలు ప్రతి జిల్లాలో ఎర్పాటు చెయ్యాలాని. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న యాదాద్రి దేవస్థానం కేంద్రంగా ఒక వాయిద్య శిక్షణ కళాశాల ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో ప్రతి సంవత్సరం జరిగే వివిధ దైెవ జాతరలో ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు సమర్పించే తలనీలాలను వేలము పద్ధతిలో కేవలం నాయీబ్రాహ్మణులకు మాత్రమే కేటాయించాలని. అదేవిధంగా నాయీబ్రాహ్మణులు రోజంతా నిలబడి కులవృత్తి నిర్వహణ చేయడం ద్వారా అనేక అరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు ముఖ్యంగా కాళ్ళు, కండ్లు సమస్యలతో ధీర్ఘకాలిక ఇబ్బందులు పడుతున్నారు కనుక వారికి 50 సంవత్సరాలు దాటిన తరువాత ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛను మంజూరు చెయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ కొరడాము జరిగింది.