కరీంనగర్ నగరంలోని 20వ డివిజన్ ఆరెపల్లి ఆర్టీసీ కాలనీ ప్రాంతాలలో ఆదివారం సుమారు 63 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ తుల రాజేశ్వరి- బాలయ్యతో కలసి నగర మేయర్ సునీల్ రావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినారు. ఈ సందర్భంగా వచ్చిన మేయర్ సునీల్ రావుకు డివిజన్ వాసులు మరియు స్థానిక కార్పొరేటర్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.