నూతన ముదిరాజ్ సంఘం కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం

1386చూసినవారు
రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఆదేశాల మేరకు సోమవారం కరీంనగర్ లో 18వ డివిజన్లోని ముదిరాజ్ సంఘం నూతన పాలకవర్గన్ని కార్పొరేటర్ మాధవి-కృష్ణగౌడ్ గ ఆధ్వర్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నూతన పాలక వర్గంలో అధ్యక్షుడు గా గుండ్ల వెంకటి, ఉపాధ్యక్షుడు పిల్లి కొండగట్టు, ప్రధాన కార్యదర్శి రేగుల ఎల్లయ్య, మిగితా 6గురు డైరెక్టర్ లని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ నూతన కార్యవర్గాన్ని సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మాధవి- కృష్ణగౌడ్ మాట్లాడుతూ.... సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు. నూతన కార్యవర్గం ముదిరాజ్ కులంలో ఉన్న బీద కుటుంబాలను గుర్తించి వారికి సంగంలో సభ్యత్వం ఇవ్వాలని కార్యవర్గం ని కోరారు. రాష్టంలో మిషన్ భగీరథ ద్వారా అన్ని చెరువులు నిండి ఎన్నో చేపలను పెంచచ్చు అన్నారు. ముదిరాజ్ సంఘానికి ఏ అవసరమైన మేము ముందుండి సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్, ముదిరాజ్ సంఘం మహిళలు, యువకులు, సభ్యులు పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్