ఈనెల 16న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నందున రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.