మెట్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

53చూసినవారు
మెట్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
మెట్ పల్లి లో గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెట్ పెల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అయన మాట్లాడుతూ గడీలపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్