చెరువుల తలపిస్తున్న కేశవపట్నం మెయిన్ రోడ్డు

74చూసినవారు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో కేశవపట్నం బస్టాండ్ సమీపంలోని కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారి పూర్తిగా జలమయమై చెరువును తలపిస్తుంది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ రహదారి నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ భారీ వర్షాలకు కలుపు దశలో ఉన్న పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్