ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని రోజు రోజుకు కోతుల బెడదతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన పండుగ సత్తయ్య ఇంటిలో ఆదివారం చొరబడి కోతులు బీభత్సం సృష్టించాయి. 50 కేజీల బియ్యాన్ని ఇంటిలోని వస్తువులను చిందర వందర చేశాయి. రూ. 10 వేలు విలువచేసే టీవీని పగలగొట్టాయి. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి కోతుల బెడద నుంచి రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.