ఇల్లంతకుంట మండలంలో శునకాల విహారం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. మంగళవారం మండల కేంద్రంలోని బస్టాండ్, జూనియర్ కాలేజీ రోడ్డు తదితర ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో కుక్కలు ఎప్పుడు ఎవరిని కాటు వేస్తాయనో బిక్కు బిక్కుమంటున్నారు. కుక్కల బెడదతో ప్రత్యేకించి చిన్నారులను ఒంటరిగా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరారు.