జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ నిరుద్యోగ యువతకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లిలోని ఎంపీడీవో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టాస్క్ రీజనల్ సెంటర్ ను తనిఖీ చేశారు. నిరుద్యోగ యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ ద్వారా 2 బ్యాచ్ లకు శిక్షణ అందించామని, ప్రస్తుతం 3వ బ్యాచ్ కు ట్రైనింగ్ జరుగుతుందన్నారు.