పెద్దపల్లి: పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే: జిల్లా కలెక్టర్

50చూసినవారు
పెద్దపల్లి: పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే: జిల్లా కలెక్టర్
ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ చౌరస్తా వద్ద 35వ వార్డులో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వేను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్