కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎంపిఓ వేణు మాధవ్ అన్నారు. ముత్తారం మండలం మచ్చుపేట, హరిపురం, మైదంబండ, కేశనపల్లి, ముత్తారం గ్రామాల్లో సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ప్రభుత్వ మద్దత ధర లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఏపిఎం పద్మ, ఏఈఓ హారిక, సిసిలు తిరుపతి, రాజ్యలక్ష్మి, రాధిక పాల్గొన్నారు.