ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు: కలెక్టర్

66చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు: కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలపై సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం 203 ప్రసవాలు నిర్వహించామని తెలిపారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్