మోడల్ స్కూల్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. మోడల్ స్కూల్ లను విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని కోరారు. పీఎంటీఏ- టీఎస్ ఆధ్వర్యంలో దశల వారీగా తమ నిరసనలు తెలుపుతున్నానన్నారు.