కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన దారుణఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపులో భాగంగా పెద్దపల్లిలో శనివారం వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు పెద్దపల్లి ఐఎంఎ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రమాకాంత్, డాక్టర్ ప్రణీత్ తెలిపారు. పెద్దపల్లిలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 17న శనివారం ఉదయం 6గంటల నుండి 18 ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు తమ సేవలు బంద్ చేస్తున్నామన్నారు.