ఆయిల్ ఫామ్ పంటతో రైతులకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆది రెడ్డి అన్నారు. మంగళవారం జూలపల్లి మండలం తెలుకుంట రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ పంట యాజమాన్యం పద్ధతులు మెలకువలు, ఆయిల్ ఫామ్ పంట వల్ల ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రత్యూష, విస్తరణ అధికారులు రాకేష్, శ్రీవాణి, కిరణ్మయి, ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ పాల్గొన్నారు.