పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన శ్రీలతకి రూ. 2. 50 లక్షలు, ఓదెల గ్రామానికి చెందిన రామస్వామికి రూ. 2. 50 లక్షలు, పెద్దపల్లి పట్టణానికి చెందిన రాధికకు రూ. 1. 50 లక్షల చొప్పున మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.