ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేసే వైద్యులు తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, డ్యూటీ టైం లో ఆసుపత్రిలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ గోదావరిఖని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్లు వైద్యులను కలిసి, అవసరమైన పరీక్షలు చేయించుకుని మందులు తీసుకుని త్వరగా వెళ్ళె విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.