పెద్దపల్లిలోని సాగర్ రోడ్డుకు చెందిన వైష్ణవి శుక్రవారం రాత్రి పాముకాటుతో మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ తీస్తుండగా కింది నుంచి వచ్చిన పాము కాటు వేసింది. ఎలుక కొరికిందని భావించిన కుటుంబ సభ్యులు పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. పాము కరిచినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.