రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, మాజీ సర్పంచ్ మ్యాకల పరుశరాములు, ఎండి సమీర్, వరికెల బాపూరావు, అమరబండ జలంధర్, అడ్డగట్ల నందం, గడ్డం సాయి, ఎండి షారుక్, మద్దిరాల భరత్ కుమార్, తదితరులు ఉన్నారు.