వేములవాడ
వేములవాడ రాజన్న కోవెలలో భక్తుల సందడి
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారి కనువిందు చేస్తున్నాయి. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అందర్నీ చల్లంగా చూడు స్వామి అంటూ.. భక్తులు కుటుంబ సమేతంగా కార్తీకదీపాలు వెలిగించి స్వామివారి సేవలో తరించారు. కార్తీక మాసంలో హరిహరులను పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని అర్చకులు చెబుతున్నారు.