చర్చలు సఫలం.. షెడ్యూల్ ప్రకారమే డిగ్రీ పరీక్షలు
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ విద్యాశాఖ చర్చలు ఫలించాయి. దీంతో నేటి నుంచి జరగాల్సిన డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల డిమాండ్ తో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకూడదని విద్యాశాఖ చర్చలు జరిపింది.