తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో BRS ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రైతు దీక్షలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి అర గ్యారెంటీ అమలు చేస్తున్నారని విమర్శించారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టారని ఆరోపించారు. తెలంగాణలో కనీసం ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ అయిందని రైతులు రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేస్తామని కేటీఆర్ అన్నారు.