టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నారంటూ వచ్చిన వార్తలకు క్లారిటీ వచ్చింది. 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' (ఖాకీ 2)లో అతిథి పాత్రలో నటిస్తున్నాడని వార్తలొచ్చినా, గంగూలీ ఈ సిరీస్ ప్రచారంలో మాత్రమే భాగమయ్యారు. నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఖాకీ దుస్తుల్లో కనిపించిన గంగూలీ, మార్కెటింగ్ ప్రమోషన్‌లో పాల్గొన్నారు. మార్చి 20 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.