ఉత్తర కొరియాకు సాయం అందించేందుకు దక్షిణ కొరియా ముందుకొచ్చింది. ఉత్తర కొరియాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రి అందజేతకు దక్షిణ కొరియా సిద్దమైంది. ఉత్తర కొరియాకు చెందిన రెడ్ క్రాస్ సంస్థకు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.