ప్రేమ బంధానికి గుడ్‌బై చెప్పిన స్టార్ హీరోయిన్?

69చూసినవారు
ప్రేమ బంధానికి గుడ్‌బై చెప్పిన స్టార్ హీరోయిన్?
స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌ తన ప్రేమబంధానికి గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది. డూడుల్‌ ఆర్టిస్టు శాంతను హజారికాతో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ జంట విడిపోయినట్లు తెలిసింది. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారని, పరస్పర అంగీకారంతోనే తమ బంధానికి గుడ్‌బై చెప్పుకున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఈ ప్రేమజంట సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు.

సంబంధిత పోస్ట్