ఉక్రెయిన్‌పై రష్యా దాడులు (వీడియో)

52చూసినవారు
ఉక్రెయిన్‌‌పై రష్యా మళ్లీ భారీ స్థాయిలో దాడులకు దిగింది. ఉక్రెయిన్‌లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వరుసగా క్షిపణులతో దాడులు చేసింది. దీంతో కీలకమైన నాలుగు విద్యుత్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయని, దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాపై ఆంక్షలు అమలు చేయాల్సి వచ్చిందని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 34 క్షిపణులను ప్రయోగించిందని, అందులో 21 క్షిపణులను మధ్యలోనే కూల్చేశామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్