స్టాక్ మార్కెట్ల ఆల్ టైమ్ రికార్డ్

74చూసినవారు
స్టాక్ మార్కెట్ల ఆల్ టైమ్ రికార్డ్
దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్, నిఫ్టీ జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ 75వేల మార్క్ దాటి గరిష్ఠంగా 75,499కు చేరింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 75,418 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ గరిష్ఠంగా 22,993 పాయింట్లను నమోదు చేసి 22,967 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద రూ. 3.8లక్షల కోట్లు పెరిగి రూ.420 లక్షల కోట్లకు చేరింది. BSEలో 212 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేయడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్