AP: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ బస్సుకు ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.