లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

53చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు.. ఇవాళ లాభాలతో శుభారంభం చేశాయి. ఉదయం సెషన్ ప్రారంభమయ్యే సమయంలో సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 74,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, మారుతీ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్