TG: మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ భూసేకరణ కోసం గతేడాది నవంబర్ 11న దుద్యాల-హకీంపేట మధ్య ప్రజాభిప్రాయసేకరణకు సమావేశం ఏర్పాటు చేశారు. భూములు కోల్పోతున్న పోలెపల్లి, హకీంపేట్, పులిచర్ల కుంట తండా, రోటిబండ తండా, లగచర్ల గ్రామాల రైతులు సమావేశాన్ని బహిష్కరించి.. నిరసనగా లగచర్లలోనే ఉండిపోయారు. లగచర్ల వచ్చిన కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు ఇతర అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలపై రాళ్ల దాడి చేశారు.