తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎండలు అదరగొడుతుంటే, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. గురువారం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ చెబుతోంది. ద్రోణి ప్రభావంతో ఈనెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.