‘పుష్ప 2’ సినిమా మేకర్స్‌పై రాజస్థాన్‌కు చెందిన రాజ్‌పుత్ నాయకుడు రాజ్ షెకావత్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సినిమాలోని భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర క్షత్రియ సమాజాన్ని అవమానించేలా ఉందని ఆరోపించాడు. అంతేకాకుండా షెకావత్ పాత్రని నెగిటివ్‌గా చూపించడంతో చాలామంది అవమానకరంగా ఫీల్ అవుతున్నారని, ఈ పదాన్ని తొలగించాలని మేకర్స్‌ని హెచ్చరించాడు. లేదంటే క్షత్రియ సామజిక వర్గానికి చెందిన కర్ణిసేనతో పుష్ప 2 మేకర్స్‌పై దాడి చేస్తామని బెదిరించాడు.