విద్యార్థుల ఆందోళనతో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం నుంచి భోజనం చేయకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వర్సిటీ పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.