నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. సెకండ్ సెమిస్టర్‌లో పరీక్ష పేపర్ వ్యాల్యూయేషన్ పారదర్శకంగా జరగలేదంటూ విద్యార్థుల ఆరోపణలు చేశారు. బ్యాక్ లాగ్ పేపర్ల రీవాల్యుయేషన్‌లో అధికారుల పొరపాట్లు బయటపడ్డట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై క్యాంపస్‌లో అధికారులను విద్యార్థులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.