కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తికావాల్సిన సునీతా విలియమ్స్ ప్రయాణానికి ఏకంగా తొమ్మిది నెలలు పట్టింది. అయితే ఆమె భారత్‌కు రావడంపై కుటుంబ సభ్యులు స్పందించారు. 9 నెలల ఎదురుచూపుల తర్వాత సునీత భూమి పైకి తిరిగి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. సునీత భూమి పైకి దిగిన క్షణాలు అపురూపమని ఆమె బంధువు ఫాల్గుణి పాండ్య అన్నారు. కాగా, సునీతను ప్రధాని నరేంద్రమోదీ ఇదివరకే భారత్‌కు ఆహ్వానించిన విషయం తెలిసిందే.